IND Vs NZ, 1st Test: న్యూజిలాండ్‌కు 356 పరుగుల ఆధిక్యం.. 137 ఏళ్ళ చరిత్రను భారత్ తిరగరాస్తుందా

IND Vs NZ, 1st Test: న్యూజిలాండ్‌కు 356 పరుగుల ఆధిక్యం.. 137 ఏళ్ళ చరిత్రను భారత్ తిరగరాస్తుందా

బెంగళూరు వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా గట్టెక్కడం కష్టంగా మారింది. ప్రత్యర్థి న్యూజిలాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో ఏకంగా 356 పరుగుల ఆధిక్యం సంపాదించింది. మరో రెండు రోజుల ఆటతో పాటు రెండు సెషన్ లు మిగిలి ఉన్నాయి. దీంతో సొంతగడ్డపై భారత్ ఈ మ్యాచ్ లో అసాధ్యాన్ని సుసాద్యం చేస్తారా లేకపోతే చేతులెత్తేస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్ లో భారత్ గనుక గెలిస్తే 137 ఏళ్ళ తర్వాత 50 పరుగుల కంటే తక్కువ పరుగులు చేసిన జట్టుగా చరిత్ర సృష్టిస్తుంది. 

1887 లో ఇంగ్లాండ్ 50 పరుగుల కంటే తక్కువ పరుగులు చేసి మ్యాచ్ గెలిచింది. సొంతగడ్డపై తిరుగులేని రికార్డ్ ఉన్న భారత్ ఎలా ఆడుతుందనే విషయం ఆసక్తిగా మారింది. ఈ మ్యాచ్ విషయానికి వస్తే తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ 402 పరుగులకు ఆలౌటైంది. రచీన్ రవీంద్ర 134 పరుగులు చేసి మూడో రోజు ఒక్కడే వారియర్ లా పోరాడాడు. సౌథీ 65 పరుగులు చేసి అతనికి సహకరాం అందించాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్, జడేజా తలో మూడు వికెట్లు తీసుకున్నారు. సిరాజ్ కు 2 వికెట్లు దక్కాయి. బుమ్రా, అశ్విన్ తలో వికెట్ పడగొట్టారు. 

Also Read :- 1338 రోజుల తర్వాత పాకిస్థాన్ టెస్ట్ విజయం

సౌథీ, రచీన్ రవీంద్ర 8 వికెట్ కు భారీ భాగస్వామ్యం నెలకొల్పడం మూడో రోజు ఆటలో హైలెట్. తొలి సెషన్ లోనే న్యూజిలాండ్ 165 పరుగులు రాబట్టింది. రెండో రోజు కాన్వే 91 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అంతకముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్ లో 46 పరుగులకే ఆలౌటైంది.