
మౌంట్ మాగనుయ్: ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్న న్యూజిలాండ్.. పాకిస్తాన్‌తో జరిగిన నాలుగో టీ20లో 115 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరోటి మిగిలి ఉండగానే 3–1తో సొంతం చేసుకుంది. టాస్ ఓడిన కివీస్ 20 ఓవర్లలో 220/6 స్కోరు చేసింది. ఫిన్ అలెన్ (50), బ్రేస్‌వాల్ (46 నాటౌట్), టిమ్ సీఫెర్ట్ (44) దంచికొట్టారు. మార్క్ చాప్‌మన్ (24), డారిల్ మిచెల్ (29) అండగా నిలిచారు.
హారిస్ రవూఫ్ 3, అబ్రార్ అహ్మద్ 2 వికెట్లు తీశారు. తర్వాత ఛేజింగ్‌లో పాకిస్తాన్ 16.2 ఓవర్లలో 105 రన్స్‌కే ఆలౌటైంది. అబ్దుల్ సమద్ (44) టాప్ స్కోరర్. ఇర్ఫాన్ ఖాన్ (24) ఫర్వాలేదనిపించాడు. జాకబ్ డఫీ (4/20), జకారీ ఫౌల్క్స్ (3/25) దెబ్బకు పాక్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. అలెన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.