న్యూజిలాండ్ కొత్త వీసా రూల్ష్ అమలు చేస్తోంది. దేశంలో పనిచేస్తున్న విదేశీయులు తమ పేరెంట్స్, పిల్లలు, విద్యార్థులకు వీసా స్పాన్సర్లను నిలిపివేసింది. కొత్త నిబంధనల ప్రకారం.. జూన్ 26 నుంచి న్యూజిలాండ్ లో ANZSCO 4, 5 లెవల్స్ లో గుర్తింపు పొందిన ఉద్యోగి వర్క్ వీసాని కలిగి ఉన్న వ్యక్తులు రెసిడెన్సీ పాత్ వేస్ లేకుండా ఇకపై వారి జీవిత భాగస్వాములు, పిల్లలు, పేరెంట్స్, విద్యార్థు లకు వీసాలు స్పాన్సర్ చేయలేరు.
ఈ ఏడాది ప్రారంభంలో ఏఈడబ్ల్యూవీ స్కీం కు చేసిన సవరణల ప్రకారం ఈ సర్దుబాటు ఉంటుంది. అయితే వివిధ రంగాల్లో స్కిల్స్ ఉంటే వారి జీవిత భాగస్వాములు, పిల్లలు కొన్ని నిబంధనలకు లోబడి ఉద్యోగ, ఇంటర్నేషనల్ స్టూడెంట్ వీసాలకోసం సొంతంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే భాగస్వాములు, డిపెండెంట్ పిల్లలుగా వీసాలున్న వారిపై ఎలంటి ప్రభావం ఉండదని న్యూజీలాండ్ ప్రభుత్వం చెబుతోంది.