భారత్ పై సిరీస్ 3-0 తో గెలిచిన న్యూజిలాండ్ కు సొంతగడ్డపై కష్టాలు తప్పడం లేదు. వెల్లింగ్ టన్ వేదికగా న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజే ఏకంగా 15 వికెట్లు నేలకూలాయి. ఇరు జట్ల బౌలర్లు విజృంభించడంతో మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగిసే అవకాశం కనిపిస్తుంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్ లో కేవలం 86 పరుగులకే 5 వికెట్లను కోల్పోయింది. క్రీజ్ లో విలియం ఒరోర్కే(0), టామ్ బ్లండెల్(7) ఉన్నారు. ప్రస్తుతం కివీస్ తమ తొలి ఇన్నింగ్స్ లో 194 పరుగులు వెనకబడి ఉంది.
ఇంగ్లాండ్ ను 280 పరుగులకే ఆలౌట్ చేసిన మంచి ఊపు మీదున్న కివీస్ బ్యాటింగ్ లో ఆ స్థాయి ఆటను చూపించలేకపోయింది. విలియంసన్ (37) మినహాయిస్తే మిగిలినవారందరూ విఫలమయ్యారు. ఇంగ్లాండ్ పేసర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో న్యూజి లాండ్ పరుగులు చేయడానికి ఇబ్బంది పడి.. చక చక ఐదు వికెట్లను కోల్పోయింది. కార్స్ వికెట్లు తీసుకోగా.. స్టోక్స్, అట్కిన్సన్, వోక్స్ తలో వికెట్ పడగొట్టారు.
Also Read : బ్లాక్ ఆర్మాండ్ ధరించిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు
అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 280 పరుగులకు ఆలౌట్ అయింది. 43 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయినా హ్యారీ బ్రూక్, పోప్ జట్టును మరోసారి ఆదుకున్నారు. బ్రూక్ 123 పరుగులు చేసి సత్తా చాటగా.. పోప్ 60 పరుగులు చేసి రాణించాడు. వీరిద్దరూ ఐదో వికెట్ కు 174 పరుగులు జోడించి ఇంగ్లాండ్ కు డీసెంట్ టోటల్ అందించారు. కివీస్ బౌలర్లలో నాథన్ స్మిత్ నాలుగు వికెట్లు తీసుకోగా.. విలియం ఒరోర్కే మూడు వికెట్లు పడగొట్టాడు. హెన్రీకి రెండు వికెట్లు దక్కాయి.
England on top at the end of a 15-wicket opening day in Wellington! https://t.co/FUY1BFka5o | #NZvENG pic.twitter.com/egxGNPFTE1
— ESPNcricinfo (@ESPNcricinfo) December 6, 2024