మౌంట్ మాగనుయ్: సౌతాఫ్రికాతో నాలుగు రోజుల్లోనే ముగిసిన తొలి టెస్ట్‌లో న్యూజిలాండ్ 281 రన్స్ భారీ తేడాతో విజయం సాధించింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0 లీడ్‌లో నిలిచింది. కివీస్ ఇచ్చిన 529 రన్స్ టార్గెట్ ఛేజింగ్‌లో బుధవారం బరిలోకి దిగిన సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 80 ఓవర్లలో 247 రన్స్‌కే ఆలౌటైంది.
బెడింగ్‌హమ్ (87) టాప్ స్కోరర్. జెమీసన్ 4, సాంట్నెర్ 3 వికెట్లు తీశారు. అంతకుముందు 179/4 ఓవర్‌నైట్ స్కోరు వద్దే కివీస్ రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. రచిన్ రవీంద్రకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. రెండో టెస్ట్ మంగళవారం నుంచి హామిల్టన్‌లో జరుగుతుంది.