టీ20 వరల్డ్ కప్ లో బ్లాక్ బస్టర్ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. ఆఫ్ఘనిస్తాన్ తో న్యూజిలాండ్ ఢీ కొట్టనుంది. న్యూజిలాండ్ కు ఈ టోర్నీలో ఇదే తొలి మ్యాచ్ కాగా.. ఆఫ్ఘనిస్తాన్ కు ఇది రెండో మ్యాచ్. వరల్డ్ కప్ ముందు న్యూజిలాండ్ ఆటగాళ్లకు ఎలాంటి ప్రాక్టీస్ మ్యాచ్ లు ఆడలేదు. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ ఉగాండాతో ఆడిన ఒక్క మ్యాచ్ లో భారీ విజయం సాధించింది. దీంతో ఈ మ్యాచ్ లో కివీస్ ఒత్తిడిలో ఉంటే.. ఆఫ్ఘనిస్తాన్ ఆత్మ విశ్వాసంతో కనిపిస్తుంది. భారత కాలమాన ప్రకారం ఈ మ్యాచ్ శనివారం (జూన్ 8) ఉదయం 5 గంటలకు జరుగుతుంది.
కివీస్ కు షాక్ ఇస్తుందా..?
బలాబలాలను పరిశీలిస్తే ఈ మ్యాచ్ లో న్యూజీలాండ్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో కివీస్ విజయం సాధించాలంటే చెమటోడ్చాల్సిందే. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ ఫామ్ చూస్తుంటే విలియంసన్ సేనకు విజయం అంత సులువుగా దక్కేలా కనిపించడం లేదు. ముఖ్యంగా వెస్టిండీస్ లో స్లో పిచ్ లు కావడంతో ఆఫ్గన్ స్పిన్నర్లను కివీస్ ఎలా ఎదుర్కొంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. మొహమ్మద్ నబీ, రషీద్ ఖాన్, ముజీబ్-ఉర్-రహమాన్ కూడిన స్పిన్ త్రయం తలచుకుంటే ఏ జట్టుకైనా కష్టాలు తప్పవు.
అదే జరిగితే ఈ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ కు న్యూజిలాండ్ షాక్ ఇచ్చినా ఆశ్చర్యం లేదు. ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే , కేన్ విలియమ్సన్ , డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్ లాంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ వీరు స్పిన్ ఆడటంతో బలహీనత అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మ్యాచ్ కివీస్ బ్యాటర్లకు, ఆఫ్ఘనిస్తాన్ స్పిన్ మధ్య జరిగే సమరంలా కనిపిస్తుంది. ఇప్పటికే అమెరికా పాకిస్థాన్ పై గెలిచి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మరి సంచలనాలకు మారు పేరైన ఆఫ్ఘనిస్తాన్ ఎలాంటి ఫలితం రాబడుతుందో చూడాలి.
న్యూజీలాండ్ తుది జట్టు (అంచనా):
ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే (వికెట్ కీపర్), కేన్ విలియమ్సన్ (కెప్టెన్), డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, మిచెల్ సాంట్నర్, ట్రెంట్ బౌల్ట్, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, ఇష్ సోధీ/జేమ్స్ నీషమ్
ఆఫ్ఘనిస్తాన్ తుది జట్టు (అంచనా)
రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, నజీబుల్లా జద్రాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, గుల్బాదిన్ నాయబ్, మొహమ్మద్ నబీ, రషీద్ ఖాన్, కరీం జనత్, ముజీబ్-ఉర్-రహమాన్, నవీన్-ఉల్-హక్, ఫజల్హక్
NZ vs AFG 2024, T20 World Cup 2024 Live Streaming: When and where to watch Afghanistan vs New Zealand Live? https://t.co/7a2mZF2QWn pic.twitter.com/Mt7tGIXcwH
— Global Voters (@global_voters) June 7, 2024