NZ vs PAK: ఐపీఎల్‌కు ముందు పాకిస్థాన్‌తో న్యూజిలాండ్ టీ20 సిరీస్.. లైవ్ స్ట్రీమింగ్, షెడ్యూల్ వివరాలు

NZ vs PAK: ఐపీఎల్‌కు ముందు పాకిస్థాన్‌తో న్యూజిలాండ్ టీ20 సిరీస్.. లైవ్ స్ట్రీమింగ్, షెడ్యూల్ వివరాలు

ఐపీఎల్ కు ముందు బోర్ కొడుతుందనుకున్న అభిమానులకు ఊరటనిచ్చే విషయం. పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆదివారం (ఏప్రిల్ 16) నుంచి ప్రారంభం కానుంది. మార్చి 16 నుంచి మార్చి 26 వరకు ఈ సిరీస్ జరగనుంది. 5 మ్యాచ్ లు 5 వేదికల్లో జరగనున్నాయి. ఆల్ రౌండర్ మైఖేల్ బ్రేస్‌వెల్ న్యూజిలాండ్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. మరోవైపు పాకిస్థాన్ కెప్టెన్ గా తొలిసారి అఘా సల్మాన్ బాధ్యతలు చేపట్టనున్నాడు. 

ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఇరు జట్లకు ఇదే తొలిసారి. ప్రపంచ క్రికెటర్లందరూ ఐపీఎల్ తో బిజీ కానున్నారు. మరోవైపు ఈ రెండు జట్ల మధ్య టీ20 జరగడంతో అభిమానులకు డబుల్ కిక్ ఖాయంగా కనిపిస్తుంది. ఐపీఎల్ కమిట్మెంట్ ల కారణంగా రెగ్యులర్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ ఈ సిరీస్ కు అందుబాటులో ఉండడం లేదు. వచ్చే ఏడాది భారత్ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచ కప్ ను దృష్టిలో పెట్టుకొని ఫిన్ అలెన్, జిమ్మీ నీషమ్, టిమ్ సీఫెర్ట్ లకు అవకాశమిచ్చారు. 

Also Read : ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‎గా అక్షర్ పటేల్

న్యూజిలాండ్ జట్టు: 

మైఖేల్ బ్రేస్‌వెల్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మార్క్ చాప్‌మన్, జాకబ్ డఫీ, జాక్ ఫౌల్క్స్ (మ్యాచ్‌లు 4-5), మిచ్ హే, మాట్ హెన్రీ (మ్యాచ్‌లు 4-5), కైల్ జామిసన్ (మ్యాచ్‌లు 1-3), డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, విల్ ఓ'రూర్కే (మ్యాచ్‌లు 1-3), టిమ్ రాబిన్సన్, బెన్ సియర్స్, టిమ్ సీఫెర్ట్, ఇష్ సోధి

పాకిస్తాన్ టీ20 జట్టు:

అఘా సల్మాన్ (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), అబ్దుల్ సమద్, అబ్రార్ అహ్మద్, హరీస్ రవూఫ్, హసన్ నవాజ్, జహందాద్ ఖాన్, ఖుష్దిల్ షా, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ అలీ, మహ్మద్ హారీస్, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, ఒమైర్ బిన్ యూసఫ్, మొహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, ఒమైర్ బిన్ యూసఫ్, షాహీం సుఫ్ ఖాన్

లైవ్ స్ట్రీమింగ్ వివరాలు:

పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ బ్రాడ్ కాస్టింగ్ సోనీ స్పోర్ట్స్ నెట్ వర్క్ లో ప్రత్యక్ష ప్రసారమవుతుంది. లైవ్ స్ట్రీమింగ్ సోనీ లైవ్ లో చూడొచ్చు. 


న్యూజిలాండ్ vs పాకిస్తాన్ టీ20 సిరీస్ షెడ్యూల్:
 
మొదటి టీ20 - మార్చి 16 (ఆదివారం) - ఉదయం 6:45 గంటలకు హాగ్లీ ఓవల్, క్రైస్ట్‌చర్చ్
రెండవ టీ20  - మార్చి 18 (మంగళవారం) - ఉదయం 6:45 గంటలకు యూనివర్సిటీ ఓవల్, డునెడిన్
మూడో టీ20  - మార్చి 21 (శుక్రవారం) - ఉదయం 11:45 గంటలకు ఈడెన్ పార్క్, ఆక్లాండ్
నాలుగో టీ20  - మార్చి 23 (ఆదివారం) - ఉదయం 11:45 గంటలకు బే ఓవల్, మౌంట్ మౌంగనుయ్
ఐదో టీ20 - మార్చి 26 (బుధవారం) - ఉదయం 11:45 గంటలకు స్కై స్టేడియం, వెల్లింగ్టన్