న్యూజీలాండ్ కొత్త సంవత్సరానికి వెల్ కమ్ చెప్పింది. అక్లాండ్ లో కొత్త సంవత్సరం వేడుకలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. 2024 కు గ్రాండ్ వెల్ కమం చెప్పారు కివీస్ ప్రజలు. అక్లాండ్ లోని స్కై టవర్ లో లేజర్, ఫైర్ వర్క్స్ షో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఆకట్టుకున్నాయి. అందరికంటే ముందుగానే కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికారు న్యూజీలాండ్ ప్రజలు.
ఆక్లాండ్ లోని స్కై టవర్ లో అద్భుతమై బాణాసంచా ప్రదర్శనతో న్యూజీలాండ్ లోని అతిపెద్ద నగరం 2024 కి స్వాగతం పలికింది. గడియారం అర్థరాత్రి 12 గంటలు తాకగానే నూతన సంవత్సారానికి స్వాగతం పలికే ప్రపంచలోనే మొదటి ప్రధాన నగరం అక్లాండ్.
ఆస్ట్రేలియాలోనూ కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సిడ్నీ, మెల్ బోర్న్ సిటీల్లో నిర్వహించిన లేజర్ షో లు ఎంతగానో ఆకట్టుకున్నాయి.