NZ vs ENG: 423 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తేడాతో కివీస్ గ్రాండ్ విక్టరీ.. మూడో టెస్టులో ఇంగ్లండ్ చిత్తు

NZ vs ENG: 423 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తేడాతో కివీస్ గ్రాండ్ విక్టరీ.. మూడో టెస్టులో ఇంగ్లండ్ చిత్తు

హామిల్టన్: ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మూడో టెస్టులో ఆతిథ్య న్యూజిలాండ్ 423 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తేడాతో ఘన విజయం సాధించింది. తొలి రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో ఓడినా ఆఖరాటలో భారీ విక్టరీతో ఊరట దక్కించుకుంది. కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చివరి టెస్టు ఆడిన తమ సీనియర్ బౌలర్ టిమ్ సౌథీకి విజయంతో వీడ్కోలు పలికింది. ఇంగ్లండ్ 2–1తో సిరీస్ గెలిచింది. నాలుగో రోజు, మంగళవారం ముగిసిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 658 రన్స్ భారీ టార్గెట్ ఛేజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నైట్ స్కోరు 18/2తో ఆట కొనసాగించిన ఇంగ్లండ్ 47.2 ఓవర్లలో 234 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే ఆలౌటైంది.

జాకబ్ బెతెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (76), జో రూట్ (54), గస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అట్కిన్సన్ (43) తప్ప మిగతా బ్యాటర్లు నిరాశపరిచారు. కెప్టెన్ బెన్ స్టోక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గాయం కారణంగా బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రాలేదు. ఆతిథ్య బౌలర్లలో మిచెల్ శాంట్నర్​ నాలుగు, మ్యాట్ హెన్రీ, టిమ్ సౌథీ రెండేసి వికెట్లు పడగొట్టారు. శాంట్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హ్యారీ బ్రూక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు లభించాయి.