
కొత్త కుర్రాళ్లతో టీ20 సిరీస్ కోసం న్యూజిలాండ్ లో అడుగుపెట్టిన పాకిస్థాన్ జట్టుకు ఘోర పరాభావం మిగిలింది. 5 టీ20 మ్యాచ్ ల టీ20 సిరీస్ కు 1-4 తేడాతో కోల్పోయింది. బుధవారం (మార్చి 26) సిరీస్ లో భాగంగా చివరిదైన ఐదో టీ20లో పాకిస్థాన్ పై న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి రెండు టీ20 మ్యాచ్ ల్లో కివీస్ గెలవగా.. మూడో టీ20లో పాకిస్థాన్ గెలిచింది. నాలుగు, ఐదు టీ 20ల్లో న్యూజిలాండ్ గెలిచి 4-1 తేడాతో సిరీస్ ను దిగ్విజయంగా ముగించింది. స్టార్ బ్యాటర్లు మహమ్మద్ రిజ్వాన్, బాబర్ అజామ్ లేకుండా సిరీస్ ఆడిన పాకిస్థాన్ కు ఘోర పరాభవం తప్పలేదు.
నేడు జరిగిన ఐదో టీ20లో పాకిస్థాన్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఘోరంగా విఫలమైంది. మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలలో 9 వికెట్ల నష్టానికి కేవలం 128 పరుగులు చేసింది. కెప్టెన్ సల్మాన్ అఘా ఒక్కడే 51 పరుగులు చేసి రాణించాడు. షాదాబ్ ఖాన్ 28 పరుగులు చేసి పర్వాలేదనిపించగా.. మిగిలిన వారు ఘోరంగా విఫలమయ్యారు. ఒక దశలో 52 పరుగులకే పాకిస్థాన్ సగం జట్టుకు కోల్పోయింది. సల్మాన్ బ్యాటింగ్ తో పాక్ ఆ మాత్రం స్కోర్ అయినా చేయగలిగింది.
129 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ ఆడుతూ పాడుతూ ఛేజ్ చేసింది. పాక్ బౌలర్లను చితక్కొడుతూ కేవలం 10 ఓవర్లలోనే టార్గెట్ ఛేజ్ చేసింది. ఈ సీరీస్ లో అద్భుత ఫామ్ లో ఉన్న ఓపెనర్ టిమ్ సీఫెర్ట్ 38 బంతుల్లోనే 97 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్ లో 6 ఫోర్లతో పాటు ఏకంగా 10 సిక్సర్లు ఉన్నాయి. ఇన్నింగ్స్ పదో ఓవర్ లో షాదాబ్ ఖాన్ బౌలింగ్ లో నాలుగు సిక్సర్లు కొట్టి మ్యాచ్ ను ఫినిష్ చేశాడు. సీఫెర్ట్ తో పాటు అలెన్ (27) కూడా రాణించడంతో పాకిస్థాన్ పవర్ ప్లే లో 92 పరుగులు రాబట్టుకుంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ 5 వికెట్లు తీసిన నీషం కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ టిమ్ సీఫెర్ట్ గెలుచుకున్నారు.
New Zealand chase down Pakistan's total in just 10 overs to seal the series 4-1! 🇳🇿🏆
— Cricket Pakistan (@cricketpakcompk) March 26, 2025
Scoreboard: https://t.co/UD9jUi5Tvq#PAKvNZ #T20ISeries #PakistanCricket pic.twitter.com/LQ4EQunL6S