మిర్పూర్ : బౌలింగ్‌లో అజాజ్ పటేల్ (6/57), మిచెల్ శాంట్నర్ (3/51) చెలరేగడంతో.. బంగ్లాదేశ్‌తో నాలుగు రోజుల్లోనే ముగిసిన రెండో టెస్ట్‌లో న్యూజిలాండ్ 4 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇరుజట్లు 1–1తో పంచుకున్నాయి. బంగ్లా నిర్దేశించిన 137 రన్స్ టార్గెట్‌ను ఛేదించేందుకు శనివారం బరిలోకి దిగిన కివీస్ రెండో ఇన్నింగ్స్‌లో 39.4 ఓవర్లలో 139/6 స్కోరు చేసింది.
గ్లెన్ ఫిలిప్స్ (40 నాటౌట్) మరోసారి పోరాడాడు. 69 రన్స్‌కే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన కివీస్‌ను ఫిలిప్స్.. శాంట్నర్ (35 నాటౌట్)తో గెలిపించాడు. అంతకుముందు 38/2 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 35 ఓవర్లలో 144 రన్స్‌కు ఆలౌటైంది.
జాకీర్ హసన్ (59) మినహా మిగతా వారు ఫెయిలయ్యారు. కివీస్ బౌలర్ల ధాటికి ఏడుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఫిలిప్స్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, తైజుల్ ఇస్లామ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి.