మౌంట్ మాంగనీ: న్యూజిలాండ్ యంగ్ క్రికెటర్ రచిన్ రవీంద్ర (240) టెస్టు కెరీర్‌లో తొలి డబుల్ సెంచరీతో సత్తా చాటాడు. దాంతో సౌతాఫ్రికాతో తొలి టెస్టులో కివీస్ పట్టు సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 258/2తో రెండో రోజు, సోమవారం ఆట కొనసాగించిన న్యూజిలాండ్ 511 వద్ద ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ (188) త్వరగానే ఔటైనా మిడిల్, లోయర్ ఆర్డర్ బ్యాటర్లతో కలిసి రచిన్ జోరు కొనసాగించాడు.
సఫారీ బౌలర్లలో నీల్ బ్రాండ్ ఆరు వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన సౌతాఫ్రికా రెండో రోజు చివరకు 80/4తో కష్టాల్లో పడింది. డేవిడ్ బెడింగ్‌హామ్ (29 బ్యాటింగ్), కీగన్ పీటర్సన్ (2 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. కైల్ జెమీసన్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఆతిథ్య జట్టు స్కోరుకు సఫారీలు ఇంకా 431 రన్స్ వెనుకంజలో ఉన్నారు.