
రావల్పిండి: తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను చిత్తు చేసి ఆత్మవిశ్వాసంతో ఉన్న న్యూజిలాండ్.. చాంపియన్స్ ట్రోఫీలో సెమీస్ బెర్త్‌పై గురి పెట్టింది. ఈ నేపథ్యంలో సోమవారం జరిగే గ్రూప్–ఎ రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఇందులోనూ గెలిచి ఎలాంటి సమీకరణాలు అవసరం లేకుండా డైరెక్ట్‌గా నాకౌట్‌కు వెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంది.
అయితే తొలి మ్యాచ్‌లో సూపర్ షో చూపెట్టిన కివీస్ జట్టులో సెలెక్షన్ డైలమా నెలకొంది. హెడ్ ఇంజ్యురీ నుంచి రచిన్ రవీంద్ర పూర్తిగా కోలుకున్నాడు. దీంతో ఓపెనింగ్‌లో డేవన్ కాన్వే, విల్ యంగ్‌లో ఎవర్ని తప్పించాలనే సందిగ్ధంలో పడింది. ముందుగా అనుకున్న ప్రకారం యంగ్‌ను తప్పించి రచిన్ తీసుకోవచ్చని సెలెక్టర్లు భావించారు.
కానీ పాక్‌పై యంగ్ సెంచరీ చేయడంతో అతన్ని తప్పించే పరిస్థితి లేకుండా పోయింది. ఇక స్పిన్‌ను కూడా బాగా ఆడుతున్నాడు. ఒకవేళ అతన్ని తప్పిస్తే టాప్ ఆర్డర్‌లో లెఫ్ట్, రైట్ కాంబినేషన్ దెబ్బతినడంతో పాటు బ్యాటింగ్ స్ట్రాజటీ మొత్తం మారిపోతుంది. కాన్వే కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు.
కాబట్టి ఈ మ్యాచ్ కోసం కివీస్ ఫైనల్ ఎలెవన్‌లో ఎలాంటి మార్పులు చేయొద్దని భావిస్తున్నారు. మరోవైపు తొలి మ్యాచ్‌లో ఇండియా చేతిలో ఓడిన బంగ్లాదేశ్‌ది చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. దీంతో టాప్ ఆర్డర్‌పై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఇక, ఈ ఆసక్తికర మ్యాచ్ సోమవారం (ఫిబ్రవరి 24) మ. 2.30 నుంచి స్టార్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ 18, జియో హాట్‌స్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్ కానుంది.