కాంతారా పూనకం మాదిరి.. పార్లమెంట్ లో స్పీచ్ అదరగొట్టిన యంగ్ ఎంపీ

మీ కోసం నేను చచ్చిపోతాను.. ఈ నేల కోసం.. ఈ చెట్ల కోసం.. ఈ ప్రకృతి కోసం.. నా మాతృ భాష కోసం.. ఈ సభలో ఇవాళ ఉంటాను.. రేపు ఉండకపోవచ్చు.. ఇవాళ నేను బతికున్నాను.. రేపు ఈ భూమిపై ఉండకపోవచ్చు.. నా భాష ఉంటుంది.. నా నేల ఉంటుంది.. నా చెట్లు ఉంది.. నా జాతి ఉంటుంది.. ఈ ప్రకృతి ఉంటుంది.. ఇవే మాటలను తన మాతృభాషలో.. హావభావాలతో చెబుతూ.. పార్లమెంట్ ను షేక్ చేసింది.. అందర్నీ మైమరిపించిది ఈ 21 ఏళ్ల ఎంపీ.. న్యూజిలాండ్ పార్లమెంట్ లో ఎంపీ మైపి క్లార్క్ చేసిన ప్రసంగం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.. కళ్లార్పకుండా తదేకంగా చూస్తూ మైమరిచిపోతున్నారు నెటిజన్లు..

న్యూజిలాండ్ ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. జాతి ఆధారంగా కాకుండా ప్రజల అవసరాలకు తగ్గట్టుగా విధానాలను మార్చాల్సిన అవసరం ఉందని.. ఈ మేరకు 12 చట్టాలకు సవరణ చేయాల్సి ఉంటుందని పార్లమెంట్ లో బిల్లు తీసుకొచ్చింది. ఈ బిల్లును వ్యతిరేకించింది మావోరీ ప్రాంతానికి చెందిన ఎంపీ. 180 ఏళ్ల క్రితం మావోరీ అనే ప్రాంతంలోని ఓ జాతికి సంబంధించి.. అప్పట్లో 12 అంశాల్లో.. అంటే నిధుల కేటాయింపు, విద్య, వైద్యం, కనీస అవసరాలు, ప్రభుత్వ విధానాల్లో ప్రత్యేక కోటా ఇలాంటి ఉన్నాయి. ఈ 180 సంవత్సరాల్లో ఎన్నో మార్పులు వచ్చాయని.. కులం, జాతి ఆధారంగా ప్రత్యేక రిజర్వేషన్లు కాకుండా.. ప్రజల అవసరాలు.. వారి ఆర్థిక అవసరాల ఆధారంగా నిర్ణయాలు ఉండాలంటూ కొత్త బిల్లులను పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది న్యూజిలాండ్ ప్రభుత్వం. 

ఈ బిల్లులను, చట్ట సవరణలను వ్యతిరేకిస్తూ.. మావోరీ ప్రాంతంలోని హౌరాకి వైకాటో నియోజకవర్గం ఎంపీగా గెలిచిన.. కమ్యూనిస్ట్ భావజాలాలు ఉన్న 21 ఏళ్ల మైపీ క్లార్క్.. తన మాతృ భాషలో.. స్థానిక జాతులు మాట్లాడే రీతిలో ఈ ప్రసంగం చేసింది. హావభావాలు ప్రదర్శిస్తూ.. ఎంతో ఎమోషనల్ గా.. ఉద్విగ్నంగా సాగిన ఈ ప్రసంగం.. పార్లమెంట్లో మిగతా సభ్యులతో చప్పట్లు కొట్టించింది. ఇక నెటిజన్లు అయితే ఈ యంగ్ ఎంపీ స్పీచ్ కు ఫిదా అవుతున్నారు. న్యూజిలాండ్ పార్లమెంట్ చరిత్రలోనే.. 170 ఏళ్ల తర్వాత.. అత్యంత పిన్న వయస్సులోనే ఎంపీగా గెలిచిన రికార్డు కూడా మైపీ క్లార్క్ పేరుతో ఉంది.