తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,539 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 2,45,682 కేసులు నమోదయ్యాయి. తాజాగా బుధవారం కరోనా బారినపడి అయిదుగురు చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 1,362కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 978 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 2,25,664గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 18,656 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా.. మరో 15,864 కేసులు హోంఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. బుధవారం 44,327 టెస్టులు చేసినట్లు.. ఇప్పటివరకు రాష్ట్రంలో 44,84,183 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.55 శాతంగా మరియు రికవరీ రేటు 91.85 శాతంగా నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.
ఇక జిల్లాల్లో నమోదయిన కరోనా కేసుల విషయానికొస్తే.. జీహెచ్ఎంసీలో 285, రంగారెడ్డి 123, మేడ్చల్ 102, కరీంనగర్ 86, భద్రాద్రి 82, ఖమ్మం 78, నల్గొండ 69, సూర్యపేట్ 52, వరంగల్ అర్బన్ 46, జగిత్యాల్ 45, మహబూబ్ నగర్ 43, సంగారెడ్డి 40, పెద్దపల్లి 39, సిద్ధిపేట్ 38, సిద్ధిపేట్ 38, నిజామాబాద్ 37, కామారెడ్డి 36, రాజన్న సిరిసిల్ల 33, నాగర్ కర్నూల్ 33, మంచిర్యాల్ 33, ములుగు 32 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.
For More News..