తెలంగాణలో మరో 1,842 కరోనా కేసులు

తెలంగాణలో మరో 1,842 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,842 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 1,06,091 కేసులు నమోదయ్యాయి. తాజాగా బుధవారం కరోనా బారినపడి 8 మంది చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 761కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 1,825 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 82,411గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 22,919 కేసులు యాక్టివ్ గా ఉన్నట్లు తెలిపింది.

ఇక జిల్లాల్లో నమోదయిన కరోనా కేసుల విషయానికొస్తే.. జీహెచ్ఎంసీలో 373, నిజామాబాద్ 158, కరీంనగర్ 134, సూర్యాపేట 113, రంగారెడ్డి 109, సిద్ధిపేట 86, ఖమ్మం 77, వరంగల్ అర్బన్ 74, జగిత్యాల 70, మహబూబాబాద్ 64, మంచిర్యాల 59, సంగారెడ్డి 50, వనపర్తి 50, నల్గొండ 47, పెద్దపల్లి 44, మహబూబ్ నగర్ 42 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

For More News..

నా చిరకాల స్నేహితుడిని కోల్పోయాను

పరిహారం ఇవ్వరు.. కొత్త ఇల్లు కట్టుకోనివ్వరు..

పేదలకు పైసా ఖర్చు లేకుండా ‘డబుల్‌‌‌‌’ ఇండ్లు