
ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అస్సలు అర్థం కావట్లేదు. బంధాలు, అనుబంధాల కంటే, ఆస్తి, ఐశ్వర్యమే ముఖ్యమనుకుంటున్నారు. మనుషులను అస్సలు లెక్క చేయట్లేదు. డబ్బుల కోసం మాయమాటలతో దగ్గరై ప్రేమ, పెళ్లి పేరుతో నిండాముంచుతున్నారు.
లేటెస్ట్ గా నవవధువు నగదుతో ఉడాయించిన ఘటన సంఘారెడ్డి జిల్లా పటాన్ చెరులో జరిగింది. మెదక్ జిల్లా లింగారెడ్డిపల్లికి చెందిన రాజేశ్వర్ మే 23న రష్మిక అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో రాజేశ్వర్ పాశమైలారంలోని ఓ పరిశ్రమలో పనికి వెళ్లాడు. తిరిగి వచ్చే సరికి రష్మిక కనిపించలేదు. తీరా చూస్తే ఇంట్లోని రూ. 2 లక్షలతో ఆమె వెళ్లిపోయినట్లు గుర్తించాడు. పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.