ఓపెన్ చేసి తాళం వేశారు.. మల్యాల పీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీలో అందుబాటులోకి రాని సేవలు

మల్యాల, వెలుగు : మల్యాలలో కొత్తగా నిర్మించిన పీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించి వదిలేశారు. ఎన్నికల కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ముందు అప్పటి ఎమ్మెల్యే రవిశంకర్ ఆదేశాలతో ఎంపీపీ మిట్టపల్లి విమల, స్థానిక ప్రజాప్రతినిధులు హడావుడిగా భవనాన్ని ప్రారంభించారు.  

అయినప్పటికీ ఆ బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తాళం వేసి ఉంచారు. ఈ విషయంపై మెడికల్​ఆఫీసర్​మౌనికను వివరణ కోరగా, బిల్డింగ్ ప్రారంభించినప్పటికి సంబంధిత ఇంజినీరింగ్ విభాగం అధికారులు తమకు ఇంకా హ్యాండోవర్​చేయలేదన్నారు.