మంచిర్యాల జిల్లా గొర్రెలు, మేకల పెంపకందార్ల సంఘం ఎన్నిక

మంచిర్యాల జిల్లా గొర్రెలు, మేకల పెంపకందారుల సహకార సంఘం కొత్త కార్యవర్గం ఎంపిక జరిగింది. ఈ మేరకు సభ్యుల నియామకం జరిగింది. సహకార సంఘం యూనియన్ చైర్మన్ గా కొమ్మ అశోక్ యాదవ్, డైరెక్టర్లుగా గట్టు మహేష్ యాదవ్, పిన్ని నరేష్ యాదవ్ లు ఎంపిక అయ్యారు. అదే విధంగా కిష్టాపూర్ గ్రామ గొర్రెల పెంపకందారులు మరియు సహకార సంఘం అధ్యక్షునిగా, గ్రామ ప్రెసిడెంట్ గా గంగుల తిరుపతి యాదవ్ ను ఎంపిక చేయటం జరిగింది. 

కొత్త కార్యవర్గం ఎంపిక తర్వాత.. సభ్యులు అందరూ హైదరాబాద్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో భేటీ అవ్వటం జరిగింది. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లాలో గొర్రెల పెంపకం, ఉత్పత్తికి సంబంధించిన అంశాలు చర్చకు వచ్చినట్లు తెలిపారు చైర్మన్ కొమ్మ అశోక్. రెండో విడత గొర్రెల పంపిణీని వేగవంతం చేయాలని.. త్వరగా పూర్తి చేయాలని మంత్రిని కోరారు కార్యవర్గం సభ్యులు.