కోరుట్ల, వెలుగు: పెళ్లైన 2 గంటలకే ఎగ్జామ్ సెంటర్కు పెళ్లికొడుకుతో కలిసి వచ్చి ఓ పెండ్లి కూతురు డిగ్రీ సెకండియర్ కెమిస్ర్టీ ఎగ్జామ్ రాసింది. జగిత్యాల జిల్లా కోరుట్లలో శుక్రవారం కొత్త పెండ్లికూతురు ఈర్నాల పద్మావతి ఆలియాస్ లాస్య తన భర్త రాజుతో కలిసి కల్లూరు రోడ్ లోని ఓ ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో ఎగ్జామ్ రాయడానికి వచ్చింది. ఆమెకు సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్ ప్రత్యేక గది కేటాయించారు. పెండ్లి సందడిలో బిజీగా ఉన్నప్పటికీ చదువుకోవాలన్న కోరికతో తన భర్త సహకారంతో ఎగ్జామ్ రాశానని పద్మావతి సంతోషంగా చెప్పింది.