అత్తాపూర్‌లో నవ వధువు ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లా: భర్త వేధింపులు భరించలేక నవ వధువు(సిద్దేశ్వరి) ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన అత్తాపూర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంభాగ్‌లో చోటుచేసుకుంది.

సిద్దేశ్వరి స్వస్థలం కామారెడ్డి జిల్లా. ఆరు నెలల క్రితమే మృతురాలికి ప్రవీణ్‌తో వివాహమయ్యింది. వివాహిత ఇంట్లో ఎవ్వరూ లేని సమయం చూసి గదిలో ఫ్యాన్ కు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. సాయంత్రం ఇంటికొచ్చిన భర్త (ప్రవీణ్) ఎంత సేపు తలుపులు కొట్టినా తెరవకపోవడంతో.. డోర్ పగళ గొట్టి ఇంట్లోకి వెళ్లాడు. తమ గదిలోకి వెళ్లి చూడగా.. సిద్దేశ్వరి  ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. వెంటనే డయల్ 100 ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. 

అల్లుడే చంపేశాడు!

భర్త వేధింపులు భరించలేక త‌మ బిడ్డ ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. కట్నం కోసం తమ బిడ్డను భర్త ప్రవీణ్ గత కొన్ని రోజులుగా వేధిస్తున్నట్లు పోలీసులకు పిర్యాదు చేశారు. భర్త వేధింపులు చెప్పుకోలేక తమ బిడ్డ కన్నీరుమున్నీరయ్యేదని వారు ఆరోపించారు.