నూతన వధూవరులు శోభిత మరియు నాగ చైతన్య (Sobhita Naga Chaitanya) తమ పెళ్లి తర్వాత మరొకరి వివాహానికి హాజరయ్యారు. స్టార్ యాక్టర్ అండ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap) కుమార్తె ఆలియా కశ్యప్ వివాహారిసెప్షన్కి హాజరై సందడి చేశారు.
ముంబైలో జరిగిన ఆలియా కశ్యప్ ఆమె భర్త షేన్ గ్రెగోయిర్ వేడుకలో శోభిత--చైతన్య అటెండై వారికి శుభాకాంక్షలు తెలిపారు. వీరి వివాహం (డిసెంబర్ 4) అనంతరం చై-శోభిత పాల్గొన్న మొదటి ఫంక్షన్ ఇదే కావడంతో అనురాగ్ కశ్యప్ కుమార్తె పెళ్ళిలో కళ కొట్టొచ్చినట్లు కనిపించింది. ప్రస్తుతం ఈ పెళ్ళికి సంబంధించిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బుధవారం (Dec 12న) సాయంత్రం ఆలియా పెళ్లికి సంబంధించిన రెడ్ కార్పెట్ వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఇందులో శోభిత, చైతన్య చిరునవ్వులు చిందిస్తూ.. కలిసి పోజులిస్తూ హుషారుగా కనిపించారు. శోభిత మెరిసే సల్వార్ సూట్‌ను బన్‌లో కట్టి ఉంచగా, చైతన్య నల్లని బంధంగాలాలో అందంగా కనిపించాడు.
Also Read:-కండక్టర్ నుంచి దేశం గర్వించదగ్గ నటుడిగా.. సూపర్‌స్టార్ రజినీకాంత్ విశేషాలివే..
అయితే.. శోభితకు డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ తన సినిమాలో అవకాశం ఇచ్చి మంచి బ్రేక్ ఇచ్చాడు. 2016 లో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ రామన్ రాఘవ్ 2.0తో శోభితకు ఛాన్స్ ఇచ్చి పెద్ద బ్రేక్ ఇచ్చాడు. తర్వాత నెట్‌ఫ్లిక్స్ ఇండియా యొక్క 2020లో వచ్చిన 'హారర్ ఆంథాలజీ ఘోస్ట్ స్టోరీస్‌లో' అనురాగ్ మరోసారి ఛాన్స్ ఇచ్చాడు. అలాగే అనురాగ్ సహ నిర్మాతగా వ్యవహరించిన మలయాళ యాక్షన్ థ్రిల్లర్ మూథోన్‌లో కూడా శోభిత కీ రోల్ చేసింది. గీతూ మోహన్‌దాస్ డైరెక్ట్ చేసింది.
ఇప్పుడు ఆ పరిచయం కారణంగానే శోభిత తన భర్త నాగచైతన్యతో కలిసి అనురాగ్ కశ్యప్ కుమార్తె పెళ్ళికి వెళ్లారు. ఇకపోతే ప్రస్తుతం అనురాగ్ కశ్యప్ ఓ వైపు దర్శకుడిగా, నటుడిగా రాణిస్తున్నాడు. ఇటీవలే విజయ్ సేతుపతి నటించిన మహారాజ సినిమాలో ప్రధాన పాత్ర పోషించాడు.