హైదరాబాద్​కు న్యూమీ స్టోర్​

హైదరాబాద్​కు న్యూమీ స్టోర్​

హైదరాబాద్, వెలుగు:  మనదేశపు ఫ్యాషన్-టెక్ బ్రాండ్‌‌‌‌‌‌‌‌లలో ఒకటైన న్యూమీ భారతదేశంలో తమ అతిపెద్ద రిటైల్ స్టోర్‌‌‌‌‌‌‌‌ను గురువారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని హైటెక్ సిటీలో వున్న శరత్ సిటీ మాల్‌‌‌‌‌‌‌‌లో ప్రారంభించింది. ఇది యువతులకు అవసరమైన లేటెస్ట్​ ట్రెండ్​​ దుస్తులను అమ్ముతుంది. ఈ స్టోర్​ ద్వారా తెలంగాణలో తమ కార్యకలాపాలను విస్తరించినట్లు ప్రకటించింది.

  దుకాణం 5,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. స్టోర్ ప్రారంభోత్సవం భాగంగా మొదటి మూడు రోజుల పాటు న్యూమీ తన వినియోగదారులందరికీ ప్రత్యేకంగా 25శాతం తగ్గింపును అందిస్తోంది.