దుబాయ్ టూర్ కి వెళ్తున్నారా..? టూరిస్ట్ వీసా కోసం అప్లయ్ చేస్తున్నారా..? దుబాయ్ టూరిస్ట్ వీసా రూల్స్ గతంలో ఉన్నంత ఈజీగా ఇప్పుడులేవు. టూరిస్ట్ వీసా రూల్స్ ను మరింత కఠినతరం చేసింది దుబాయ్ ఇమ్మిగ్రేషన్ డిపార్టుమెంట్..అప్లికేషన్ ప్రాసెస్ ను మరింత సులభతరం చేసేందుకు ఈ కొత్త రూల్స్ అమలు చేయాలని ట్రావెల్ ఏజెన్సీలకు దుబాయ్ ఇమ్మిగ్రేషన్ డిపార్టుమెంట్ సూచించింది.
దుబాయ్ టూరిస్ట్ వీసా కొత్త రూల్స్..
గతంలో దుబాయ్ టూరిస్త్ వీసా రూల్స్ చాలా సులభంగా ఉండేవి..ఇప్పు డు మరింత కఠినతరం చేసింది. కొత్తగా కొన్ని రూల్స్ తీసుకొచ్చింది అక్కడి ప్రభుత్వం. టూరిస్టు వీసా పొందాలంటే.. వీసా అప్లికేషన్, హోటల్ బుకింగ్ డాక్యుమెంట్లు, తిరుగు ప్రయాణానికి సంబంధించిన రిటర్న్ టికెట్ల కాపీలను తప్పని సరి చేసింది. ఇమ్మిగ్రేషన్ డిపార్టుమెంట్ వెబ్ సైట్ లో వీసా అప్లికేషన్, క్యూఆర్ కోడ్ తో హోటల్ బుకింగ్ డాక్యుమెంట్లు, రిటర్న్ టికెట్ల కాపీలను తప్పకుండా అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
ఫైనాన్షియల్ ప్రూఫ్ కూడా..
టూరిస్టులు కంపల్సరీ తమ సరిపడా ఆర్థిక వనరులు కూడా చూపించాలి. రెండు నెలల టూరిస్ట్ వీసా పొందాలంటే వారి ఖాతాల్లో రూ.1.14 లక్షలు బ్యాలెన్స్ చూపించాలి.
వీసా అప్లికేషన్ కు అవసరమైన డాక్యుమెంట్లు..
వీసా రకాన్ని బట్టి అవసరాలు మారుతూ ఉంటాయి.
- లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజు ఫోటో
- కనీసం ఆరు నెలల చెల్లుబాటుతో పాస్‌పోర్ట్
- UAEలో ఆరోగ్య బీమా చెల్లుబాటు
- రిటర్న్ ట్రావెలింగ్ టికెట్లు
- GCC నివాసితుల కోసం, నివాస అనుమతి కాపీ.
- ఆర్థిక వనరులు ప్రూఫ్ కాపీ