Samantha: సమంతకు OTT అవార్డు.. ఎన్నోసార్లు 'స్పృహ కోల్పోయానంటూ' స్టేజీపై ఎమోషనల్

Samantha: సమంతకు OTT అవార్డు..  ఎన్నోసార్లు 'స్పృహ కోల్పోయానంటూ' స్టేజీపై ఎమోషనల్

హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu)నటించిన రీసెంట్ మూవీ సిటాడెట్ హనీ బన్నీ (Citadel Honey Bunny).మయోసైటిస్తో బాధపడుతూనే ఈ వెబ్ సిరీస్లో నటించింది. ఈ సిరీస్లో సమంత నటనకు గాను ఆమెకు ఓటీటీ ఉత్తమ అవార్డు లభించింది. హీరామండి మూవీలో నటించిన మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితీరావ్ కూడా 'ఉత్తమ నటి అవార్డ్' కోసం పోటీపడ్డారు. కానీ ఈ ప్రతిష్టాత్మక అవార్డ్ సమంతను వరించింది.

సిటాడెల్ హనీ జన్నీ వెబ్ సిరీస్లో క్లిష్టమైన స్టంట్స్తో అదరగొట్టేసింది సామ్. ఆమె శ్రమ వృథా పోలేదు. సామ్ నటన, యాక్షన్ సీన్స్కి ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన వచ్చింది. హాలీవుడ్ సిటాడెట్లో ప్రియాంక చోప్రా నటన కంటే, భారతీయ వెర్షన్ రీమేక్లో సామ్ బాగా యాక్ట్ చేసిందనే టాక్ తెచ్చుకుంది. రాజ్ & డికె దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో వరుణ్ ధావన్ హీరోగా నటించాడు.

ALSO READ | శ్రీదేవి కూతురికి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన మెగా కోడలు ఉపాసన..

న్యూస్ 18 షోషా రీల్ అవార్డ్స్ 2025 (News18 Showsha Reel Awards 2025) ఉత్సవాల్లో పాల్గొన్న సమంత అనందానికి అవధుల్లేవ్. అవార్డ్ అందుకున్న సమంత కళ్లలో మెరుపులు కనిపించాయి. తన హార్డ్ వర్క్కి తగిన గుర్తింపు లభించిందనే ఆనందం తన కళ్లలో కనిపించింది.

ఈ నేపథ్యంలో అవార్డు అందుకున్న సామ్ మాట్లాడుతూ.. 'ఇది నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. నాకు ఇష్టమైన ఎంతోమంది నటీమణులు ఈ అవార్డుల నామినీ బరిలో ఉన్నారు. నిజానికి ఈ సిరీస్ ను పూర్తి చేయడమే నాకు ఆవార్డు. ఎన్నో ప్రతికూల పరిస్థితుల  మధ్య దీన్ని పూర్తిచేశాను. నన్ను నమ్మిన వారికి ఈ ఆవార్డును అంకితం చేస్తున్నాను.

రాజ్ అండ్ డీకే, వరుణ్ దావన్ల కారణంగానే నేను 'సిటడెల్ హనీబన్నీ'ని చేయగలిగాను. ఈ సిరీస్ పూర్తి చేసేందుకు ఓపికను కూడాగట్టుకొని పనిచేశాను. నన్ను వారంతా ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. ఈ విషయంలో యూనిట్ వారందరికీ కృతజ్ఞతలు' అని సమంత చెప్పారు. ఈ సిరీస్ చిత్రీకరణ సమయంలో ఎన్నోసార్లు  స్పృహ కోల్పోయినట్లు సమంత ఎమోషనల్ అయింది.