కివీస్‌‌‌‌‌‌‌‌కే కిరీటం తొలిసారి విమెన్స్‌‌‌‌‌‌‌‌ టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ నెగ్గిన న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌

కివీస్‌‌‌‌‌‌‌‌కే కిరీటం తొలిసారి విమెన్స్‌‌‌‌‌‌‌‌ టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ నెగ్గిన న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌

దుబాయ్‌‌‌‌‌‌‌‌: న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌ అమ్మాయిల జట్టు తమ కలను నిజం చేసుకుంది. విమెన్స్‌‌‌‌‌‌‌‌ టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌లో తొలిసారి విజేతగా నిలిచింది. 2009, 2010 ఎడిషన్లలో ఫైనల్లో ఓడిన  కివీస్‌‌‌‌ తమ మూడో ఫైనల్లో మెప్పించి ఎట్టకేలకు టీ20 కిరీటాన్ని కైవసం చేసుకుంది.   మరోవైపు వరుసగా రెండోసారి ఫైనల్‌‌‌‌‌‌‌‌కు వచ్చిన సౌతాఫ్రికాకు మళ్లీ నిరాశే మిగిలింది. ఆల్‌‌‌‌‌‌‌‌రౌండ్ షోతో అదరగొట్టిన కివీస్ ఆదివారం జరిగిన ఫైనల్లో 32 రన్స్ తేడాతో సఫారీలను ఓడించింది. 

తొలుత న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 158/5 స్కోరు చేసింది. అమేలియా కెర్ (38 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 4 ఫోర్లతో 43), బ్రూక్ హలీడే (28 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 3 ఫోర్లతో 38), సుజీ బేట్స్ (32) రాణించారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంలబా రెండు వికెట్లు పడగొట్టింది. ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో సౌతాఫ్రికా ఓవర్లన్నీ ఆడి 126/9 స్కోరు చేసి ఓడింది. కెప్టెన్ లారా వోల్‌‌‌‌‌‌‌‌వర్ట్‌‌‌‌‌‌‌‌ (27 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 5 ఫోర్లతో 33) పోరాడినా ఫలితం లేకపోయింది.  అమేలియా కెర్‌‌‌‌‌‌‌‌ (3/24), రోస్‌‌‌‌‌‌‌‌మేరీ మైర్ (3/25) చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అమేలియాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌, టోర్నీ అవార్డులు లభించాయి.   

ముగ్గురి పోరాటం

టాస్‌‌‌‌‌‌‌‌  ఓడి బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు వచ్చిన న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌కు అమేలియా కెర్ , బ్రూక్ హలీడే, సుజీ బేట్స్ మంచి స్కోరు అందించారు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే ఓపెనర్ జార్జియా ప్లిమ్మర్ (9)ను ఔట్‌‌‌‌‌‌‌‌ చేసిన ఖకా సఫారీలకు బ్రేక్ ఇచ్చింది. అయితే, వన్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌ బ్యాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అమేలియా, సుజీ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ను చక్కదిద్దారు. ఈ ఇద్దరూ క్రమం తప్పకుండా బౌండ్రీలు కొట్టగా పవర్ ప్లేలో కివీస్ 43/1తో నిలిచింది. కానీ, పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లే తర్వాత సఫారీ బౌలర్లు కట్టడి చేశారు. వరుసగా ఎనిమిది ఓవర్లలో ఒక్క బౌండ్రీ కూడా ఇవ్వలేదు.ఈ క్రమంలో స్పిన్నర్ ఎంలబా ..  సుజీ బేట్స్ ను బౌల్డ్ చేయగా,  11వ ఓవర్లో   సోఫీ డివైన్‌‌‌‌‌‌‌‌ (6)ను డిక్లెర్క్‌‌‌‌‌‌‌‌ ఎల్బీగా పెవిలియన్‌‌‌‌‌‌‌‌ చేర్చింది. అయితే క్రీజులో కుదురుకున్న తర్వాత హలీడే ఒక్కసారిగా వేగం పెంచింది. 

సున్ లుస్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో వరుసగా రెండు ఫోర్లు రాబట్టింది.  డిక్లెర్క్‌‌‌‌‌‌‌‌ ఓవర్లో హలీడే, అమేలియా చెరో ఫోర్ బాదడంతో 15 ఓవర్లకు కివీస్‌‌‌‌‌‌‌‌ 110/3తో నిలిచింది. తర్వాతి మూడు ఓవర్లలోనూ ఒక్క బౌండ్రీ రాకపోయినా సింగిల్స్‌‌‌‌‌‌‌‌, డబుల్స్ రాబట్టారు. కానీ,  ట్రైయన్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో  పుల్‌‌‌‌‌‌‌‌ షాట్‌‌‌‌‌‌‌‌కు ట్రై చేసి హలీడే ఔట్ అయింది. ఎంలబా వేసిన 19వ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన కెర్ కూడా పెవిలియన్ చేరగా.. ఆఖరి ఓవర్లో మ్యాడీ గ్రీన్‌‌‌‌‌‌‌‌ (12 నాటౌట్‌‌‌‌‌‌‌‌) సిక్స్‌‌‌‌‌‌‌‌ సహా 16 రన్స్ రావడంతో స్కోరు 150 మార్కు దాటింది. 

 సఫారీలు ఢమాల్‌‌‌‌‌‌‌‌

ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో ఓపెనర్లు లారా వోల్‌‌‌‌‌‌‌‌వర్ట్‌‌‌‌‌‌‌‌, తంజిమ్‌‌‌‌‌‌‌‌ బ్రిట్స్‌‌‌‌‌‌‌‌ (17) తొలి వికెట్‌‌‌‌‌‌‌‌కు 51 రన్స్ జోడించి అద్భుత ఆరంభం అందించినా మధ్యలో వరుసగా వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా డీలా పడింది. పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేలో కెప్టెన్ వోల్‌‌‌‌‌‌‌‌వర్ట్‌‌‌‌‌‌‌‌ వరుస బౌండ్రీలతో ఆకట్టుకుంది. కానీ, జొనాస్ వేసిన  ఏడో ఓవర్లో బ్రిట్స్‌‌‌‌‌‌‌‌ ఔటైన తర్వాత కివీస్ ఒక్కసారిగా జోరు పెంచింది. కాసేపటికే ఒకే ఓవర్లో  వోల్‌‌‌‌‌‌‌‌వర్ట్‌‌‌‌‌‌‌‌తో పాటు  అనెకె బాష్ (9)ను పెవిలియన్‌‌‌‌‌‌‌‌ చేర్చిన అమేలియా కెర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సఫారీ టీమ్‌‌‌‌‌‌‌‌ను దెబ్బకొట్టింది. ఆపై, స్పిన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్సన్‌‌‌‌‌‌‌‌ వరుస బాల్స్‌‌‌‌‌‌‌‌లో మరిజేన్ కాప్ (8), నడైన్ డిక్లెర్క్‌‌‌‌‌‌‌‌ (6)ను ఔట్ చేయడంతో సౌతాఫ్రికా 78/5తో డిఫెన్స్‌‌‌‌‌‌‌‌లో పడిపోయింది. కాసేపు ప్రతిఘటించిన సున్‌‌‌‌‌‌‌‌ లూస్‌‌‌‌‌‌‌‌ (8) భారీ షాట్‌‌‌‌‌‌‌‌కు ట్రై చేసి బేట్స్‌‌‌‌‌‌‌‌కు క్యాచ్ ఇచ్చి ఆరో వికెట్‌‌‌‌‌‌‌‌గా వెనుదిరిగింది. చివరి మూడు ఓవర్లలో 52 రన్స్‌‌‌‌‌‌‌‌ అవసరం అవ్వగా కెర్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో డెర్క్‌‌‌‌‌‌‌‌సెన్‌‌‌‌‌‌‌‌ (10),  రోస్‌‌‌‌‌‌‌‌మేరీ మైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓవర్లో చోలె ట్రైయన్ (14), జాఫ్టా (6)  ఔటవడంతో కివీస్ గెలుపు ఖాయమైంది. 

ప్రైజ్‌‌మనీ

న్యూజిలాండ్‌‌: రూ. 19.67 కోట్లు
సౌతాఫ్రికా: రూ. 9.83 కోట్లు

సంక్షిప్త స్కోర్లు

న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌: 20 ఓవర్లలో 158/5 (కెర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 43, హలీడే 38, సుజీ 32, ఎంలబా 2/31).
సౌతాఫ్రికా: 20 ఓవర్లలో 126/9 (వోల్‌‌‌‌‌‌‌‌వర్ట్‌‌‌‌‌‌‌‌ 33, కెర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 3/24, రోస్‌‌‌‌‌‌‌‌మేరీ 3/25)