
లాహోర్: ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్న న్యూజిలాండ్.. పాకిస్తాన్‌తో జరిగిన నాలుగో టీ20లోనూ 4 రన్స్ తేడాతో గెలిచింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2–1 లీడ్‌లో నిలిచింది. గురువారం రాత్రి ముగిసిన ఈ మ్యాచ్‌లో.. టాస్ ఓడిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 178/7 స్కోరు చేసింది. టిమ్ రాబిన్సన్ (51), డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్ (34) రాణించారు. తర్వాత పాకిస్తాన్ 20 ఓవర్లలో 174/8 స్కోరుకే పరిమితమైంది. ఫకర్ జమాన్ (61) హాఫ్ సెంచరీ వృథా కాగా, ఇఫ్తికార్ అహ్మద్ (23), ఇమద్ వసీమ్ (22)తో సహా మిగతా వారు ఫెయిలయ్యారు.