హామిల్టన్: కేన్ విలియమ్సన్ (133 నాటౌట్) సెంచరీతో దుమ్మురేపడంతో.. నాలుగు రోజుల్లోనే ముగిసిన రెండో టెస్ట్‌లో న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో సౌతాఫ్రికాపై గెలిచింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను కివీస్ 2–0తో క్లీన్‌స్వీప్ చేసింది. 267 రన్స్ టార్గెట్‌ను ఛేదించేందుకు 40/1 ఓవర్‌నైట్ స్కోరుతో శుక్రవారం బరిలోకి దిగిన న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 94.2 ఓవర్లలో 269/3 స్కోరు చేసింది.
టామ్ లాథమ్ (30), రచిన్ రవీంద్ర (20) నిరాశపర్చినా, విలియమ్సన్, విల్ యంగ్ (60 నాటౌట్) నాలుగో వికెట్‌కు అజేయంగా 152 రన్స్ జోడించి టీమ్‌ను గెలిపించారు. డేన్ పిడెట్ 3 వికెట్లు తీశాడు. విలియమ్ ఓ రూర్కెకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, విలియమ్సన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి.