
ఐపీఎల్ 2025 సీజన్ ఈ సారి ముందుగానే రాబోతుంది. ప్రతిసారి ఏప్రిల్ లో ప్రారంభమయ్యే ఐపీఎల్ ఈ సారి మార్చిలోనే స్టార్ట్ కానుంది. 2025 ఐపీఎల్ సీజన్ మార్చ్ 22 నుంచి ప్రారంభం కానుంది. మే 25న జరగబోయే ఫైనల్ తో ముగుస్తుంది. దీనికి సంబంధించి ఐపీఎల్ షెడ్యూల్ ఇప్పటికే ప్రకటించారు. అంతేకాదు రానున్న రెండు సీజన్ల షెడ్యూల్ తేదీలను విడుదల చేసింది. 2026 ఐపీఎల్ సీజన్ మార్చి 15 నుంచి ప్రారంభం కానుంది. అంటే ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్ కు వారం ముందుగా జరగబోతుంది. మ్యాచ్ ల సంఖ్య ఎక్కువ కావడమే ఇందుకు కారణం అని తెలుస్తుంది.
2026 సీజన్ మార్చి 15 నుంచి మే 31 వరకు.. 2027 సీజన్ మార్చి 14 నుంచి మే 30 మధ్య జరుగుతుంది. దీంతో పాటు ఒక్కో సీజన్‌లో ఎన్ని మ్యాచ్ లు జరుగుతాయో మ్యాచ్‌ల జాబితాను రిలీజ్ చేసింది. 2023, 2024 సీజన్ లో 74 మ్యాచ్ లు జరిగాయి. రానున్న ఐపీఎల్ సీజన్ లో కూడా 74 మ్యాచ్ లే జరగనున్నాయి. 2026, 2027 ఐపీఎల్ సీజన్ లో మాత్రం మొత్తం 84 మ్యాచ్ లు జరుగుతాయి. 2028 ఐపీఎల్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ ల సంఖ్య 94 కు చేరే అవకాశాం ఉన్నట్టు సమాచారం.
Also Read :- ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. టాప్-10లో మనోళ్లే నలుగురు
ప్రస్తుతం ఐపీఎల్ లో మొత్తం 10 జట్లు తలబడుతున్నాయి. ఒక్కో జట్టు కొన్ని జట్లతో రెండు.. మరికొన్ని జట్లతో ఒక మ్యాచ్ ఆడుతుంది. అయితే 2026,2027 ఐపీఎల్ లో మాత్రమే ప్రతి జట్టు ఇతర జట్లతో రెండు మ్యాచ్ లు ఆడేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అదే జరిగితే అభిమానులకు రెండున్నర నెలలు పండగే. మరో 9 రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ విషయానికి వస్తే మొత్తం 74 మ్యాచులు 65 రోజుల పాటు జరుగుతాయి. ఇందులో 12 డబుల్-హెడర్ మ్యాచ్‌లు. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్(KKR), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్లు తలపడనున్నాయి.