నెక్స్ట్ చర్చిలు, గుడులపై కేంద్రం కన్ను: ఉద్ధవ్ ఠాక్రే

నెక్స్ట్ చర్చిలు, గుడులపై కేంద్రం కన్ను: ఉద్ధవ్ ఠాక్రే

వక్ఫ్ భూములపై కన్నేసిన కేంద్రం.. ఇక గుడుల ఆస్తులపై ఫోకస్ చేస్తుందని శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. చర్చీలు, గురుద్వారాల భూములనూ లాక్కునేందుకు కుట్ర పన్నుతోందన్నారు.  లాగేసుకున్న భూములను.. ప్రధాని మోదీ తన దోస్తులకు కట్టబెట్టేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ముంబైలో ఉద్ధవ్ ఠాక్రే మీడియాతో మాట్లాడారు. 

‘‘బీజేపీ, దాని మిత్రపక్షాలు.. వక్ఫ్ బిల్లుపై చర్చ సందర్భంగా ముస్లింల పట్ల చూపిన వైఖరి.. పాకిస్థాన్ వ్యవస్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నాకు కూడా సిగ్గుచేటు తెప్పించేలా ఉంది. హిందూ, ముస్లిం అంశాన్ని.. బీజేపీ తన స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటున్నది’’ అని ఉద్ధవ్ ఆరోపించారు. తమ పార్టీ వక్ఫ్ బోర్డు బిల్లుకు మద్దతిస్తున్నట్లు గానీ.. వ్యతిరేకిస్తున్నట్లు గానీ చెప్పలేదని, బీజేపీ ద్వంద్వ వైఖరిని మాత్రం వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు.