నాలుగు రోజులు  తేలికపాటి జల్లులు

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలోని పలు చోట్ల రానున్న నాలుగు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌‌ వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. టీఎస్‌‌డీపీఎస్‌‌ డేటా ప్రకారం.. కుమ్రం భీమ్ ఆసిఫాబాద్‌‌ జిల్లాలోని వెంకటరావుపేట, ఆదిలాబాద్‌‌లోని ఇచ్చోడలో 5 సెంటీ మీటర్లు, జగిత్యాలలోని పగిడిపల్లిలో 3.5 సెం.మీ., నిర్మల్‌‌లోని భైంసాలో 2.8 సెం.మీ., పెద్దపల్లిలోని కమాన్‌‌పూర్‌‌లో 2.6 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది.