ఫ్లైట్ ఆలస్యమయ్యింది.. విచారణకు సమయం కావాలి... ఏసీబీకి నెక్స్ట్ జెన్ ప్రతినిధుల రిక్వెస్ట్..

ఫార్ములా ఈ కార్ రేసు కేసులో నెక్స్ట్ జెన్ కంపెనీ ప్రతినిధులు ఏసీబీ విచారణకు హాజరు కానున్న సంగతి తెలిసిందే.. శనివారం ( జనవరి 18, 2025 ) ఉదయం ఏసీబీ విచారణకు హాజరు అవ్వాల్సి ఉన్న క్రమంలో ఫ్లైట్ ఆలస్యం అయ్యిందని.. విచారణకు సమయం కావాలని ఏసీబీకి విజ్ఞప్తి చేశారు నెక్స్ట్ జెన్ ప్రతినిధులు. ఇవాళ మధ్యాహ్నం తరువాత విచారణ కు హాజరవుతామని తెలిపారు నెక్స్ట్ జెన్ ప్రతినిధులు. 

ఫార్ములా ఈ రేస్‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన అగ్రిమెంట్స్‌‌‌‌‌‌‌‌ సహా ఇతర డాక్యుమెంట్లు తీసుకురావాలని సూచించింది. ఇప్పటికే ఈ కేసు దర్యాప్తులో భాగంగా మాజీ మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌, సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఐఏఎస్‌‌‌‌‌‌‌‌ అర్వింద్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌, హెచ్‌‌‌‌‌‌‌‌ఎండీఏ మాజీ సీఈ బీఎల్‌‌‌‌‌‌‌‌ఎన్‌‌‌‌‌‌‌‌ రెడ్డిని ఏసీబీ విచారించింది.

ఫార్ములా -ఈ రేసుకు మొదట స్పాన్సర్‌‌‌‌‌‌‌‌గా వ్యవహరించిన ఏస్‌‌‌‌‌‌‌‌ నెక్స్ట్​ జెన్‌‌‌‌‌‌‌‌ ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌తో పాటు దాని మాతృ సంస్థ గ్రీన్‌‌‌‌‌‌‌‌కో కార్యాలయాల్లో ఈ నెల 7న ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. మాదాపూర్‌‌‌‌‌‌‌‌లో సైబర్‌‌‌‌‌‌‌‌ టవర్స్‌‌‌‌‌‌‌‌లో, మచిలీపట్నంలోని గ్రీన్‌‌‌‌‌‌‌‌కో కార్యాలయాల్లో తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్స్‌‌‌‌‌‌‌‌ ఆధారంగా ఈ రెండు కంపెనీల ప్రతినిధులకు ఏసీబీ నోటీసులు జారీ తెలిసింది.