కాలుష్యం పెరిగితే వచ్చే తరం మనల్ని క్షమించదు : పొన్నం ప్రభాకర్

మొక్కలు నాటడం అంటే భవిష్యత్తు తరాలకు సహకారం అందించడమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేసినా ప్రజల సహకారం అవసరమని తెలిపారు. మొక్కలు నాటడమే కాదు ఆ బాధ్యతను కూడా ప్రజలు తీసుకోవాలని సూచించారు. మొక్కలు నాటడం సమాజంలో బాధ్యత అని గుర్తు చేశారు. కాలుష్యం పెరిగితే వచ్చే తరం మనల్ని క్షమించదని ప్రజలందరూ వారి వారి కుటుంబ సభ్యులు బంధువుల పేరుతో వచ్చిమొక్కలు నాటాలని కోరారు. 

 మొక్కలు నాటడం ఆడంబరం కాదని ప్రజలందరూ చిత్తశుద్ధితో  వనమహోత్సవంలో పాల్గొనాలని సూచించారు. గత 10 ఇళ్లలో నాటిన మొక్కల వివరాలు అవసరం లేదని  వచ్చే పదేళ్లలో మేము నాటే మొక్కలను ప్రజలు చూస్తారని చెప్పారు. గతంలో నాటిన మొక్కలపై పిట్టలు గూళ్లు కూడా పెట్టలేదని విమర్శించారు. అటవీశాఖ ఆధ్వర్యంలో సమాజానికి మంచి మంచి చేసే మొక్కలను తీసుకువచ్చి పెంచుతమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.

Also Read:కాంగ్రెస్ పార్టీలో పదవుల పండగ : 35 మందికి నామినేటెడ్ పోస్టులు ఇవే