
న్యూఢిల్లీ : ప్రభుత్వ యాజమాన్యంలోని విద్యుత్ కంపెనీ ఎన్‌టీపీసీ అనుబంధ సంస్థ అయిన ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ రూ. 10 వేల కోట్లను సమీకరించేందుకు వచ్చే నెల మొదటి వారంలో తన ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)ను తీసుకురానుంది. ఇందుకోసం కంపెనీ సెబీకి డాక్యుమెంట్లు అందజేసింది. పబ్లిక్‌ఇష్యూ కోసం కంపెనీ భారతదేశం (ముంబై)తో పాటు విదేశాలలో ముఖ్యంగా సింగపూర్‌లో రోడ్‌షోలను ప్లాన్ చేసింది.
ఐపీఓలో ఫ్రెష్ఇష్యూ మాత్రమే ఉంటుంది. ఓఎఫ్ఎస్ ఉండదు. ఇష్యూ ద్వారా వచ్చిన రూ. 7,500 కోట్ల మొత్తాన్ని అప్పులు తీర్చడానికి, సాధారణ, కార్పొరేట్ ప్రయోజనాల కోసం వినియోగిస్తారు.