
నోయిడాలోని నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్- దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ ఎన్‌ఎఫ్‌ఎల్ యూనిట్లలో 74 మేనేజ్‌మెంట్ ట్రైనీ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ కోరుతోంది.
అర్హత: పోస్టును అనుసరించి ఎంఎస్సీ, ఎంబీఏ, పీజీడీబీఎం, పీజీడీఎం, సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ సీఎంఏ, ఎల్‌ఎల్‌బీ, బీఎల్ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో డిసెంబర్ 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు www.nationalfertilizers.com వెబ్సైట్లో సంప్రదించాలి.