
మంగళవారం (మార్చి11) స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. ముఖ్యంగా ఐటీ స్టాక్స్ దారుణంగా నష్టపోయాయి. ఇన్ఫోసిస్, విప్రో, ఎల్‌టిఐమైండ్‌ట్రీ, టిసిఎస్, టెక్ మహీంద్రా, ఎంఫసిస్, కోఫోర్జ్, జెన్సార్ టెక్నాలజీస్, బిర్లాసాఫ్ట్ ,సోనాట సాఫ్ట్‌వేర్ వంటి ఐటీ స్టాక్‌లు అత్యధికంగా నష్టపోయాయి.వివిధ రంగాలపై ట్రంప్ సుంకాలు ప్రభావం,యూఎస్ మార్కెట్లో దిద్దుబాట్లు ఇన్వెస్టర్లను భయాందోళనలు ఇన్వెస్టర్లను అమ్మకాలకు ప్రేరేపితం చేశాయి.
BSEలో BSE ఐటీ ఇండెక్స్ అత్యధికంగా నష్టపోయింది. 795 పాయింట్లు నష్టపోయి 36వేల 203 దగ్గర ట్రేడ్ ముగిసింది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 2.1శాతం నష్టపోయింది. 818 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ ఐటీ స్టాక్స్ 36వేల826 కనిష్టానికి చేరుకుంది.
ALSO READ | స్టాక్ మార్కెట్ మళ్లీ నష్టాలు : ఒకేసారి రూ.200 తగ్గిన ఆ బ్యాంక్ షేరు
మంగళవారం ట్రేడింగ్‌లో BSE IT ఇండెక్స్‌లో LTIMindtree Ltd 3.19శాతం, TCS 1.42శాతం, Infosys Ltd3.85శాతం, Wipro 2.77శాతం,Tech Mahindra 1.5శాతం, Mphasis 2.81శాతం, Coforge 4శాతం, Zensar Technologies 5శాతం, Birlasoft 5శాతం, Sonata Software 4శాతం IT స్టాక్‌లు అత్యధికంగా నష్టపోయాయి.
జనవరి 20న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా దిగుమతులపై అదనంగా 10 శాతం సుంకం విధిస్తామని ప్రకటించిన తర్వాత, కెనడా, మెక్సికోలపై సుంకాలను విధిస్తున్నట్లు ప్రకటించిన తర్వాత ఐటీ షేర్లు దిద్దుబాటు ధోరణిలో ఉన్నాయి.