లివర్ వ్యాధి పేషెంట్ ఆపరేషన్ కు.. ఎన్ జీఎఫ్ రూ. లక్ష సాయం

 నెల్లికుదురు, వెలుగు: వరంగల్ జిల్లా నెల్లికుదురు మండలం బ్రాహ్మణ కొత్తపల్లికి చెందిన ఎండీ సలీమా కొన్నాళ్లుగా లివర్ వ్యాధితో బాధపడుతుండగా.. ఆపరేషన్ కు రూ.30 లక్షల ఖర్చు అవుతాయని డాక్టర్లు సూచించారు.  అంత డబ్బు లేక దిక్కుతోచని స్థితిలో సాయం కోసం ఎదురుచూస్తోంది. ఎన్ జీఎఫ్ సభ్యురాలైన సలీమా ఆపరేషన్ కు  బుధవారం రూ. లక్ష సాయంగా ఎన్ జీఎఫ్ అధ్యక్షుడు ఏకాంతం గౌడ్ గౌడ్, జనరల్ సెక్రటరీ మహిపాల్ రెడ్డి అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ‘ ఉన్న ఊరు – కన్న తల్లి’ నినాదంతో ఏర్పడి 32 మంది సభ్యులతో  ఎన్ జీఎఫ్ సేవలు అందిస్తోందన్నారు. ఆపదలో ఉన్న ఎందరినో ఆదుకుందని, సంస్థలో సభ్యుడైన షరీఫ్ తల్లి సలీమాను ఆదుకోవడానికి సభ్యులు ముందుకు రావడం, అమెరికాలోని చిదిరాల రాజు రూ.50 వేలు సాయంగా పంపడం  అభినందనీయమన్నారు. ఎన్ జీఎఫ్ ప్రతినిధులు ప్రభాకర్ రెడ్డి, దిలీప్ తదితరులు ఉన్నారు.