భూస్వాములు, రియల్టర్ల కోసమే అలైన్​మెంట్ మార్చిన్రు: ఎన్​హెచ్ బాధితులు

భూస్వాములు, రియల్టర్ల కోసమే అలైన్​మెంట్ మార్చిన్రు: ఎన్​హెచ్  బాధితులు
  •  బండి సంజయ్​కు ఎన్​హెచ్ 63 బాధిఫిర్యాదు

చిర్యాల, వెలుగుమం: ఎన్​హెచ్ఏఐ అధికారులు కొంతమంది భూస్వాములు, రియల్టర్లతో కుమ్మక్కై ఎన్​హెచ్ 63 అలైన్​మెంట్​ను మూడుసార్లు మార్చి తమకు అన్యాయం చేస్తున్నారని బాధిత రైతులు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్​కు ఫిర్యాదు చేశారు. రాంపూర్​కు వచ్చిన కేంద్రమంత్రిని కలిసి తమ గోడు విన్నవించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నుంచి మంచిర్యాల వరకు గ్రీన్​ఫీల్డ్ హైవే కోసం 2018లో అలైన్మెంట్ రూపొందించి గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారని, తర్వాత బ్రౌన్​ఫీల్డ్​గా మార్చి ఇప్పుడున్న హైవేనే ఫోర్​ లేన్​గా విస్తరించేందుకు మరో నోటిఫికేషన్ జారీ చేశారని తెలిపారు.

అయితే లక్సెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలో రోడ్డు 135 ఫీట్ల వెడల్పు ఉన్నప్పటికీ 100 ఫీట్లు మాత్రమే ఉందని తప్పుడు రిపోర్టు ఇచ్చి దానిని సైతం అడ్డుకున్నారన్నారు. తాజాగా గోదావరి తీరం నుంచి గ్రీన్​ఫీల్డ్ హైవే కోసం అలైన్​మెంట్ రూపొందించి భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేశారన్నారు. ఇప్పటికే ఎల్లంపల్లి ప్రాజెక్టు కోసం తమ భూములు తీసుకున్నారని, రెండోసారి సేకరించవద్దని సుప్రీంకోర్టు గైడ్​లైన్స్​ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదన్నారు. తమకు న్యాయం చేయాలని కోరారు.