
వివిధ విభాగాల్లో డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి ఢిల్లీలోని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ జారీ చేసింది. డైరెక్ట్ రిక్రూట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్న ఈ పోస్టులకు ఈ నెల 24వ తేదీ లోపు అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టులు (60): డిప్యూటీ మేనేజర్.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ (సివిల్) ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 30 ఏండ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేండ్లు, ఎస్సీ/ ఎస్టీలకు ఐదేండ్లు, దివ్యాంగులకు పదేండ్లు సడలింపు ఉంటుంది.
సెలెక్షన్ ప్రాసెస్: 2024లో సాధించిన గేట్స్కోర్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.