హైదరాబాద్-విజయవాడ హైవేపై టోల్ ఫీజులు భారీగా తగ్గింపు

హైదరాబాద్-విజయవాడ హైవేపై టోల్ ఫీజులు భారీగా తగ్గింపు

హైదరాబాద్: నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) కీలక ప్రకటన చేసింది. NH-65 హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిలో ప్రయాణించే వాహనాలకు టోల్ ఫీజును తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుంచి ఈ తగ్గించిన టోల్ ఫీజు అమల్లోకి రానుంది. మార్చి 31 అర్ధరాత్రి నుంచే హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిలో టోల్ ఫీజుల్లో తగ్గింపు వర్తిస్తుంది. మార్చి 31, 2026 వరకూ.. అంటే సరిగ్గా సంవత్సరం పాటు తగ్గించిన టోల్ ఫీజులే అమల్లో ఉంటాయి.

హైదరాబాద్-విజయవాడ రూట్లోని పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు టోల్ ప్లాజాల పరిధిలో టోల్ ఛార్జీలపై తగ్గింపును వాహనదారులు పొందొచ్చని NHAI వెల్లడించింది. పంతంగి టోల్ ప్లాజా దగ్గర కార్లు, జీప్స్, వ్యాన్లు, లైట్ మోటార్ వెహికల్స్కు గతంలో సింగిల్ జర్నీకి 95 రూపాయలు, రౌండ్ ట్రిప్కు 145 రూపాయల టోల్ ఫీజు వసూలు చేసేవారు. తాజాగా.. NHAI పంతంగి టోల్ ప్లాజా టోల్ ఫీజును సింగిల్ జర్నీపై 15 రూపాయలు, రౌండ్ ట్రిప్పై 30 రూపాయలు తగ్గించింది. దీంతో.. పంతంగి టోల్ ప్లాజా దగ్గర మార్చి 31 అర్ధరాత్రి నుంచి సింగిల్ జర్నీకి 80 రూపాయలు, రౌండ్ ట్రిప్కు 115 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది.

లైట్ కమర్షియల్ వెహికల్స్, మినీ బస్సులు, లైట్ గూడ్స్ వెహికల్స్ సింగిల్ జర్నీకి 150 బదులు 125 రూపాయలు, రౌండ్ ట్రిప్కు 230 రూపాయలకు బదులు 190 రూపాయలు చెల్లించేలా వాహనదారులపై టోల్ భారాన్ని NHAI తగ్గించింది. బస్సులు, డబుల్ యాక్సిల్ ట్రక్కులు ఇకపై సింగిల్ జర్నీకి 315 రూపాయలకు బదులుగా 265 రూపాయలు, రౌండ్ ట్రిప్కు 470 రూపాయలకు బదులుగా 395 రూపాయలు చెల్లిస్తే చాలు. ఇక.. త్రీ యాక్సిల్ ట్రక్కులకు గతంలో సింగిల్ జర్నీకి 485 రూపాయలు, రౌండ్ ట్రిప్కు 725 రూపాయల టోల్ ఫీజును పంతంగి టోల్ ప్లాజా దగ్గర వసూలు చేశారు. ఇకపై.. త్రీ యాక్సిల్ ట్రక్కులకు సింగిల్ జర్నీకి 290 రూపాయలు, రౌండ్ ట్రిప్కు 435 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది.

Also Read:-ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన గోల్డ్.. నేడు రూ.7వేల 100 అప్

కార్లు, జీప్స్, వ్యాన్లపై తగ్గించిన టోల్ రేట్లు ఇలా ఉన్నాయి:


(కొర్లపహాడ్ టోల్ ప్లాజా):
* గతంలో సింగిల్ జర్నీకి  రూ.130.. ఇకపై 120 రూపాయలు
* రౌండ్ ట్రిప్కు గతంలో రూ.195.. ఇకపై 180 రూపాయలు

(చిల్లకల్లు టోల్ ప్లాజా, ఆంధ్రప్రదేశ్):
* గతంలో సింగిల్ జర్నీకి  రూ.110.. ఇకపై 105 రూపాయలు
* రౌండ్ ట్రిప్కు గతంలో రూ.160.. ఇకపై 155 రూపాయలు