హైదరాబాద్, వెలుగు: వ్యవసాయ ఉత్పత్తులు, మసాలా దినుసుల ఎగుమతిదారు ఎన్హెచ్సీ ఫుడ్స్ గత డిసెంబరుతో ముగిసి మూడో క్వార్టర్ ఫలితాలను ప్రకటించింది. ఏడాది ప్రాతిపదికన నికర లాభం 384 శాతం పెరిగి రూ.20.83 కోట్లకు చేరుకుంది.
కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం రూ.46.49 కోట్ల నుంచి 58 శాతం పెరిగి రూ.73.52 కోట్లకు చేరుకుంది. 2024 డిసెంబర్ 31తో ముగిసిన తొమ్మిది నెలల కాలానికి కంపెనీ నికరలాభం 384 శాతం పెరిగి రూ.61.30 కోట్లకు ఎగిసింది.
ఇదేకాలంలో కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం రూ.13.62 కోట్ల నుంచి 64 శాతం పెరిగి రూ.21.42 కోట్లకు చేరుకుంది. కంపెనీ 2025 ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ.20.88 కోట్లు, క్యూ2లో రూ.20.50 కోట్ల లాభాలను ఆర్జించింది.