ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులకు తీరనున్న కష్టాలు

ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులకు తీరనున్న కష్టాలు

 

  • హైదరాబాద్​ హైవేపై ఎంట్రీ పాయింట్ దగ్గర ఫ్లై ఓవర్ మంజూరు
     
    ఖమ్మం, వెలుగు : ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనదారులకు కష్టాలు తీరనున్నాయి. ఖమ్మం, సూర్యాపేట జాతీయ రహదారి, హైదరాబాద్​ జాతీయ రహదారిని కలిసే చోట ఫ్లై ఓవర్​ ను నేషనల్​ హైవే అథారిటీ ఆఫ్​ ఇండియా (ఎన్​హెచ్ఐఏ) మంజూరు చేసింది. ఇప్పటి వరకు ఖమ్మం నుంచి వెళ్తున్న వాహనాలు సూర్యాపేట హైవేపై ఎంట్రీ వద్ద విజయవాడ వైపు సుమారు 2 కిలోమీటర్లు ప్రయాణించి యూటర్న్​ తీసుకొని హైదరాబాద్​ వెళ్లాల్సి వస్తోంది. ఈ ఎంట్రీ పాయింట్ దగ్గర ఫ్లై ఓవర్​ లేకపోవడంతో జరిగే అనేక రోడ్డు ప్రమాదాలను వివరిస్తూ కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీకి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖరాశారు. బ్లాక్ స్పాట్ గా గుర్తించి, ఫ్లై ఓవర్ మంజూరు చేయాలని లేఖ రాయగా, తాజాగా ఫ్లై ఓవర్​ ను నేషనల్ హైవే అథారిటీ మంజూరు చేసింది.

దీంతో వాహనదారులకు ప్రయాణంలో సౌకర్యంతో పాటు ఎలాంటి యాక్సిడెంట్లు జరగకుండా ఉండటం కోసం ఫ్లై ఓవర్ ఉపయోగకరంగా ఉంటుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు. మంజూరైన పనులను వీలైనంత త్వరగా ప్రారంభించాలని నేషనల్ హైవే అథారిటీ అధికారులను తుమ్మల కోరారు.