న్యూఢిల్లీ, వెలుగు: పుష్ప2 బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిందని, దీనికి కారణమైన సినీ హీరో అల్లు అర్జున్, ప్రొడక్షన్ టీమ్, సంధ్య థియేటర్ మేనేజ్మెంట్పై చర్యలు తీసుకోవాలని జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ యుగంధర్ గౌడ్ కంప్లైట్ చేశారు. బీసీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామ్మూర్తి గౌడ్‌తో కలిసి ఢిల్లీలోని ఎన్హెచ్ఆర్సీ ఆఫీస్‌లో ఫిర్యాదు చేశారు.
అనంతరం తెలంగాణ భవన్లో యుగంధర్ గౌడ్ మాట్లాడారు. ‘‘అల్లు అర్జున్ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అభిమానులను కంట్రోల్ చేయలేమని పోలీసులు హెచ్చరించినా పట్టించుకోలేదు. అల్లు అర్జున్ నిర్లక్ష్యంగానే ఓ మహిళ చనిపోయింది. ఆమె కొడుకు చావుబతుకుల మధ్య ఉన్నాడు’’అని తెలిపారు.