కరీంనగర్ లో ఎన్ఐఏ సోదాలు

కరీంనగర్  హుస్సేనీపురాలో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేశారు.   నగరంలోని తబ్రేజ్ అనే వ్యక్తి ఇంట్లో ఇవాళ ఉదయం నుంచి ఎన్ఐఏ టీం సోదాలు చేసింది.  నిషేదిత పీఎఫ్ఐ సంస్థతో తబ్రేజ్ కు సంబంధాలు ఉన్నట్లు సమాచారం రావడంతో సోదాలు చేశారు. 

ఇవాళ(ఆగస్టు10) తెల్లవారు జామున 3-.30 గంటలకి  తబ్రేజ్ ఇంటికి వచ్చిన ఎన్ఐఏ అధికారులు   దాదాపు ఐదు గంటల పాటు  సోదాలు చేశారు. అయితే తబ్రేజ్ దుబాయ్ లో ఉంటున్నట్లు గుర్తించారు.  తబ్రేజ్ ఇంట్లో ఎన్ఐఏ కీలక ఆధారాలు సేకరించినట్లు‌  తెలుస్తోంది