కాన్పూర్/లక్నో: వరుసగా రైలు ప్రమాద కుట్రలు బయటపడుతుండడంతో రైల్వే శాఖ సీరియస్‌గా తీసుకున్నది. సోమవారం జరిగిన కాళింది ఎక్స్ప్రెస్ఘటనపై నేషనల్ఇన్వెస్టిగేషన్ఏజెన్సీ (ఎన్ఐఏ)ని రంగంలోకి దింపింది. విద్రోహ చర్య కోణంలో ఎన్ఐఏ ఎంక్వైరీ మొదలుపెట్టింది. స్థానిక పోలీసులతో కలిసి దర్యాప్తు ముమ్మరం చేసింది. యూపీలోని ప్రయాగ్‌రాజ్ నుంచి భివానీకి వెళ్తున్న కాళింది ఎక్స్‌ప్రెస్ కాన్పూర్సమీపంలోకి రాగానే పట్టాలపై ఉన్న గ్యాస్ సిలిండర్‌ను ఢీకొట్టింది.
పట్టాలపై ఏదో వస్తువు ఉన్నట్టు గుర్తించిన లోకో పైలట్ అప్రమత్తమై, బ్రేకులు వేశారు. అయినా.. సిలిండర్‌ను రైలు ఢీకొట్టింది. రైలు ప్రమాద కుట్రను ఛేదించేందుకు యూపీ యాంటి టెర్రరిస్ట్ స్క్వాడ్‌తో పాటు ఎన్ఐఏ సహా పలు ఏజెన్సీల బృందాలు రంగంలోకి దిగాయి. ఈ కేసులో ఇద్దరు స్థానిక రౌడీ షీటర్లతో సహా ఆరుగురిని కాన్పూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రైలు పట్టాలపై సిమెంట్దిమ్మె
రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో మరో రైలు ప్రమాద కుట్ర వెలుగుచూసింది. దుండగులు రైలుపట్టాలపై ఓ సిమెంట్దిమ్మెను పెట్టగా.. అజ్మీర్– అహ్మదాబాద్ వెళ్తున్న రైలు దాన్ని ఢీకొట్టింది. దీంతో ఇంజిన్‌తో పాటు కొంతభాగం దెబ్బతిన్నది. కాగా, మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ఇటార్సీ రైలు మార్గంలోని గురంఖేడీ వద్ద గుర్తుతెలియని వ్యక్తులు రైల్వేట్రాక్‌పై ట్రాక్టర్‌ను వదిలేసి వెళ్లారు. లోకోపైలట్ అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది.