హైదరాబాద్లో ఎన్ఐఏ సోదాలు.. పాతబస్తీ సహా నాలుగుచోట్ల కొనసాగుతున్న రైడ్స్

హైద‌రాబాద్‌ : త‌మిళ‌నాడు, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు(NIA Raids) నిర్వహిస్తోంది. సుమారు 30 చోట్ల శనివారం (సెప్టెంబర్ 16న) త‌నిఖీలు జ‌రుగుతున్నాయి. ఐఎస్ఐఎస్ రిక్రూట్మెంట్‌తో లింకున్న కేసులో ఈ సోదాలు చేప‌డుతున్నారు. కోయంబ‌త్తూరులో 21 చోట్ల, చెన్నైలో మూడు చోట్ల, హైద‌రాబాద్‌లో 4 ప్రదేశాల్లో, టెన్కాశిలో ఒక చోటు త‌నిఖీలు నిర్వహిస్తున్నారు. గ‌ ఏడాది కోయంబ‌త్తూరులో జ‌రిగిన కారు పేలుడు ఘ‌ట‌న‌కు సంబంధించిన కేసులో.. ఐసిస్ కోణంలో విచార‌ణ చేప‌డుతున్నారు.

ALSO READ:  హైదరాబాద్ క్యాబ్ డ్రైవర్ కు రూ.22 లక్షల లాటరీ..

డీఎంకే కౌన్సిల‌ర్ ఇంట్లో కూడా త‌నిఖీలు జ‌రుగుతున్నట్లు తెలుస్తోంది. 82వ వార్డు మెంబ‌ర్ ఎం ముబాసీరాతో పాటు రామ‌స్వామి వీధిలో సోదాలు చేప‌డుతున్నారు. అయితే.. ఇప్పటి వ‌రకు ఎటువంటి అరెస్టు జ‌ర‌గ‌లేదు. ఈ కేసుతో లింకు ఉన్న మొహ‌మ్మద్ అజారుద్దిన్ ను ఇటీవ‌ల అరెస్టు చేసిన అత‌న్ని త్రిసూరులోని జైలులో బంధించారు.