జిల్లాల్లో ఎన్ఐఏ సోదాలు.. పేలుడు పదార్థాలు స్వాధీనం

పేలుడు పదార్థాల కేసులో దర్యాప్తు కంటిన్యూ అవుతోంది. రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో 9 ప్రదేశాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. మేడ్చల్, మహబూబ్ నగర్, వరంగల్, జనగామ, భద్రాద్రి జిల్లాలో సోదాలు చేశారు. ఈ సోదాల అనంతరం పలువురు వ్యక్తులకు నోటీసులు జారీ చేశారు. మేడ్చల్‌లో కొమ్మురాజు కనకయ్య ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. భద్రాద్రి జిల్లాలో గుంజి విక్రమ్, త్రినాథరావు ఇళ్లలో సోదాలు చేశారు. జనగామలో సూర సారయ్య, వరంగల్‌లో వేలుపు స్వామి ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. నిందితుల నుంచి 400 ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, 500 నాన్ ఎలక్ట్రిక్ డిటొనేటర్లు స్వాధీనం చేసుకున్నారు. 400 జిలిటెన్ స్టిక్స్, 549 మీటర్ల ఫ్యూజ్ వైర్లు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టు నేత హిడ్మకు ఈ పేలుడు పదార్థాలను రవాణా చేయడానికి సిద్దం చేసినట్లు అధికారులు గుర్తించారు. ఐఈడీ, గ్రెనేడ్ లాంచర్ల తయారీకి సామగ్రి సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. మరోవైపు పేలుడు పదార్థాల తయారీకి సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.