మోడీని చంపేస్తాం.. ఎన్ఐఏకు బెదిరింపు మెయిల్..

ప్రధాని నరేంద్ర మోడీని చంపేస్తామంటూ ముంబైలోని ఎన్ఐఏ కార్యాలయానికి బెదిరింపు మెయిల్ వచ్చింది. మోడీ హత్యకు కుట్ర చేసినట్లు ఈ మెయిల్లో పేర్కొన్నారు. ప్రధాని హత్య కోసం 20 మంది స్లీపర్ సెల్స్ ఫిబ్రవరి 28 నుంచి రెడీగా ఉన్నారని.. 20 కేజీల ఆర్డీఎక్స్ను కూడా సిద్ధం చేసినట్లు అందులో పేర్కొన్నారు. ప్రధానితో పాటు వేలాది మందిని హతమారుస్తామని, ఇందుకోసం దేశవ్యాప్తంగా 20చోట్ల దాడులకు ప్లాన్ సిద్ధం చేసినట్లు చెప్పారు. ప్రధాని నరేంద్రమోడీ తన జీవితాన్ని నాశనం చేశాడని మెయిల్ పంపిన వ్యక్తి ఆరోపించాడు. పలు టెర్రరిస్టు ఆర్గనైజేషన్ లు కుట్రలో పాలుపంచుకుంటున్నట్లు అందులోని వివరాలను బట్టి తెలుస్తోంది. బెదిరింపు మెయిల్పై కేంద్ర హోం శాఖ అత్యున్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. వివరాలను పలు ఏజెన్సీలకు పంపి ఐపీ అడ్రన్తో పాటు మెయిల్ను ఎవరు పంపారు? ఎక్కడి నుంచి పంపారు? అన్న విషయాలపై ఆరా తీస్తున్నారు.