డిగ్రీ,బీటెక్ తో NIABలో ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్, INSTEM లో వెబ్ డెవలపర్ పోస్టులు

డిగ్రీ,బీటెక్ తో NIABలో  ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్, INSTEM లో వెబ్ డెవలపర్ పోస్టులు

ఎన్ఐఏబీలో ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్

ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ పోస్టుల భర్తీ కోసం నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్​ ఆనిమల్ బయోటెక్నాలజీ(ఎన్ఐఏబీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు మే 2వ తేదీలోగా ఆన్​లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
పోస్టు: ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ III 
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి బీఎస్సీ, బీటెక్ లేదా బీఈ, ఎంఎస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 
వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 35 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్:  ఆన్​లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: మే 2.

ఐఎన్ఎస్ టీఈఎంలో  వెబ్ డెవలపర్

ప్రోగ్రామర్/ వెబ్ డెవలపర్ పోస్టు భర్తీ కోసం ఇన్ స్టిట్యూట్ ఫర్ స్టెమ్​సెల్ సైన్స్ అండ్ రీజనరేటివ్ మెడిసిన్(ఐఎన్ఎస్ టీఈఎం) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్ 30వ తేదీలోగా ఆన్​లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
పోస్టు: ప్రోగ్రామర్/ వెబ్ డెవలపర్
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి కంప్యూటర్ సైన్స్​లో బీఈ/ బీటెక్ లేదా సమాన అర్హతతోపాటు వెబ్​సైట్ డెవలప్​మెంట్​​లో 2 ఏండ్ల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 35 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్:  ఆన్​లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: ఏప్రిల్ 30.