DC vs LSG: పూరన్, మార్ష్ విధ్వంసం.. ఢిల్లీ ముందు బిగ్ టార్గెట్

DC vs LSG: పూరన్, మార్ష్ విధ్వంసం.. ఢిల్లీ ముందు బిగ్ టార్గెట్

విశాఖ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో లక్నో భారీ స్కోర్ చేసింది. పూరన్, మిచెల్ మార్ష్ ల విధ్వంసంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. 30 బంతుల్లోనే 7 సిక్సర్లు.. 6 ఫోర్లతో 75 పరుగులు చేసిన పూరన్ టాప్ స్కోరర్ గా  నిలిచాడు. మరో ఎండ్ లో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ 36 బంతుల్లో 6 ఫోర్లు.. 6 సిక్సర్లతో 72 పరుగులు చేసి దుమ్ములేపాడు. లక్నో బౌలర్లలో స్టార్క్ మూడు వికెట్లు తీసుకున్నాడు. కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీసుకోగా.. ముకేశ్, నిగమ్ లకు తలో వికెట్ లభించింది.      

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జయింట్స్ కు ఓపెనర్లు మార్కరం, మిచెల్ మార్ష్ మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. ముఖ్యంగా మార్ష్ బౌండరీలతో హోరెత్తించాడు. 15 పరుగులు చేసిన తర్వాత మార్కరం క్యాచ్  ఔటయ్యాడు. ఈ దశలో పూరన్ తో జత కట్టిన మార్ష్ ఇన్నింగ్స్ ను శరవేగంతో ముందుకు తీసుకెళ్లారు. ఏ బౌలర్ ను వదలకుండా బౌండరీలతో పరుగుల వరద పారించారు. వీరిద్దరూ రెండో వికెట్ కు 7 ఓవర్లలోనే 84 పరుగులు జోడించడం విశేషం. 

ALSO READ | గ్రేడ్-ఎలో ముగ్గురికి చోటు.. భారత మహిళా క్రికెటర్ల సెంట్రల్ కాంట్రాక్ట్ వివరాలు ఇవే!

ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని ముకేశ్ కుమార్ విడగొట్టాడు. 72 పరుగులు చేసిన మార్ష్ బౌండరీ దగ్గర క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. మార్ష్ ఔటైనా పూరన్ విధ్వంసం ఆగలేదు. ఆ తర్వాత ఓవర్(13) లోనే  స్టబ్స్ బౌలింగ్ లో వరుసగా నాలుగు సిక్సర్లతో పాటు ఒక ఫోర్ బాదాడు. ఈ ఓవర్లో మొత్తం 28 పరుగులు రావడంతో ఢిల్లీ స్కోర్ 250 పరుగులకు చేరడం ఖాయంగా కనిపించింది. అయితే స్వల్ప వ్యవధిలో లక్నో కుప్పకూలింది. పంత్ డకౌట్ కాగా.. ఆ వెంటనే జోరు మీదున్న పూరన్ పెవిలియన్ కు చేరాడు. బదోని(4) శార్దూల ఠాకూర్ (0) షాబాజ్ (9) ఇలా వచ్చి అలా వెళ్లారు. చివరి ఓవర్లో మిల్లర్ (27) రెండు సిక్సర్లు కొట్టడంతో లక్నో 200 పరుగుల మార్క్ అందుకుంది.